మంగళవారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఉదండాపూర్ గ్రామ ప్రజలకు శుభవార్త అందించారు. R&R ప్యాకేజీ కింద రూ. 150 కోట్ల స్ట్రక్చర్ అమౌంట్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి, ఫైల్ పై సంతకం పూర్తయిందని, లబ్ధిదారుల ఖాతాల్లో ఈరోజు అమౌంట్ జమ అవుతుందని స్పష్టం చేశారు. మిగతా మొత్తాన్ని ఈ నెలాఖరులోపు విడుదల చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ ద్వారా హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఉదయపూర్ ప్రజలకు భారీ ఊరట లభిస్తుందని ఆయన తెలిపారు.