జడ్చర్ల: స్కూల్ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండ ద్వారకపురి కాలనీలో మంగళవారం సాయంత్రం ఎస్. వీ. కే. ఏం పాఠశాలకు చెందిన బస్సు అకస్మాత్తుగా ఒక వైపుకు ఒరిగిపోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. స్థానికులు వెంటనే అప్రమత్తమై బస్సులోని విద్యార్థులను సురక్షితంగా కిందకు దించారు. ఈ సంఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్