జడ్చర్ల నియోజకవర్గంలో మంగళవారం కంట్లో కారం చల్లి ఓ మహిళ మెడలో నుంచి మూడున్నర తులాల బంగారం అపహరించిన ఘటన చోటుచేసుకుంది. బాలానగర్ సమీపంలో ఫరూఖ్ నగర్ మండలం పోతురాజు తాండకు చెందిన సరోజ, మొబైల్ క్యాంటీన్ పెట్టుకొని జీవనం సాగిస్తుండగా, అన్నం తిన్న తర్వాత ఓ మహిళ కారులో డబ్బులు ఉన్నాయని చెప్పి, మిరప కారం తీసుకుని వచ్చి కంట్లో చల్లింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది.