మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ చిన్నారులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని, వాటి బెడద నుంచి విముక్తి కల్పించాలని గురువారం రాజాపూర్ మండల ప్రజలు కోరారు. రోడ్లపై నిత్యం సంచరించే వీధి కుక్కల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, గ్రామ పంచాయతీ పాలకవర్గం, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.