మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని నాగసాల సమీపంలో గల స్వామి నారాయణ గురుకుల పాఠశాలలో సోమవారం ఒక విద్యార్థిపై ఉపాధ్యాయుడు దాడి చేయడంతో అతనికి చెవికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు, ఏబీవీపీ నాయకులు పాఠశాల వద్ద నిరసన తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని, దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.