జడ్చర్ల: ప్రభుత్వ నిర్లక్ష్యంపై మాజీ మంత్రి ఆగ్రహం

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన నేపథ్యంలో మంగళవారం జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీ, వంద పడకల హాస్పిటలు, నూతనంగా నిర్మించిన మార్చురీ బిల్డింగును మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి పరిశీలించారు. ప్రభుత్వ చేతగాని తనం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. ఘటనకు అధికారులతో పాటు, ప్రజా ప్రతినిధులు కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్