మహబూబ్ నగర్: తుఫాన్ ఎఫెక్ట్.. రాకపోకలు బంద్

మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని నవాబుపేట-కొందుర్గు మండలాల మధ్య వెంకిర్యాల వద్ద వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం నుంచి తాత్కాలిక రోడ్డుపై వరదనీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. బ్రిడ్జి నిర్మాణం ఆలస్యం కావడం వల్ల ప్రతి వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ, వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్