మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల చెరువులో ఇనుము కోసం వెళ్లి గల్లంతైన తిమ్మాజీపేట మండలం మామిడిచెట్టు తండాకు చెందిన రమేష్ మృతదేహం శనివారం లభ్యమైంది. అగ్నిమాపక శాఖ అధికారులు గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.