జడ్చర్ల: రెండు బస్సులు ఢీ.. మహిళకు గాయాలు

బాలానగర్ మండల కేంద్రంలో ఆదివారం మహబూబ్ నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రైవేటు బస్సు అద్దం పగిలిపోవడంతో అందులో ఉన్న ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఆర్టీసీ డ్రైవర్ పగిలిన అద్దాన్ని కొత్తది కొనిస్తానని తెలపడంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఘటనతో రహదారిపై కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది.

సంబంధిత పోస్ట్