జడ్చర్ల: బైక్ పైనుంచి పడి మహిళకు తీవ్ర గాయాలు

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలంలోని వాడ్యాల గ్రామ గేటు వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. కూరగాయలు కొనుగోలు చేసి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్న సమయంలో, అకస్మాత్తుగా అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి మహిళ కింద పడిపోయారు. స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన మహిళను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్