నారాయణపేట నుంచి జడ్చర్లకు సోమవారం ఆర్టీసీ బస్సులో వచ్చిన నేహా అనే ప్రయాణికురాలు, టిఫిన్ కోసం ఆటోలో ప్రయాణిస్తుండగా తన ఫోన్‌ను మర్చిపోయింది. డ్యూటీలో ఉన్న స్టేషన్ మాస్టర్ రవీంద్రనాథ్, ఆర్టీసీ సెక్యూరిటీ గార్డ్ లింగంపేట నరసింహులు ఆటోలో ఫోన్‌ను గుర్తించి, వెంటనే నేహాకు తిరిగి అప్పగించారు. వారి నిజాయితీని స్థానికులు ప్రశంసించారు.