జడ్చర్ల: BRS మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం: హరీష్‌రావు

కాంగ్రెస్ రైతు వంచన సభ అని పెట్టుకోవాలని మాజీమంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. మంగళవారం జడ్చర్ల సమావేశంలో మాట్లాడుతూ.. యాసంగి రైతుబంధు పూర్తి స్థాయిలో వేయలేదని, ఇప్పుడు వానాకాలం రైతుబంధు వేస్తామంటున్నారని మండిపడ్డారు. ఇక సీఎం రేవంత్ పాలమూరు పరువు తీస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ రూ.29,300 కోట్లు రైతులకు బాకీ పడిందన్నారు. KCR చేతిలో ఉంటేనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందన్నారు. మళ్లీ BRS అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్