జడ్చర్ల: యాప్‌ పేరుతో రూ.13.25 లక్షల మోసం

అధిక లాభాల ఆశ చూపి QVSE యాప్‌లో పెట్టుబడులు పెట్టించడంతో రూ. 13. 25 లక్షల మోసం జరిగినట్లు జడ్చర్ల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. లాభాలు పెరుగుతున్నట్లు చూపినా డబ్బులు విత్‌డ్రా కాకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు దర్యాప్తులో ఉందని సీఐ కమలాకర్ తెలిపారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కు సమాచారం ఇవ్వడంతో పాటు National Cyber Crime Reporting Portale కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే సంబంధిత లావాదేవీలను నిలిపివేసి, మోసపోయిన నగదును ఫ్రీజ్ చేయడానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕