జడ్చర్ల: నమ్మించి ఫోన్ కొట్టేసి.. రూ. 40 వేలు డ్రా

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలోని మల్లేపల్లి రోడ్డులో ఆదివారం ఒక సెల్ ఫోన్ దొంగతనం జరిగింది. సాకేత్ కూల్ డ్రింక్ హోల్ సెల్ దుకాణ యజమాని బాలగౌడ్ కు చెందిన మొబైల్ ను గుర్తుతెలియని వ్యక్తి, సరకులు కావాలని ఫోన్ చేసుకుంటానని నమ్మించి, ఫోన్ ను దొంగిలించాడు. గతవారం క్రితం జరిగిన ఈ సంఘటనలో ఫోన్ లో ఉన్న రూ. 40 వేలు డ్రా అయినట్లు బాధితుడు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్