మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు మంగళవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. జడ్చర్ల పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో ఉదయం 10:00 గంటలకు మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై అవగాహన, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేటీఆర్ పార్టీ సభ్యత్వ నమోదు, SIR పై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారు.