మేడే సందర్భంగా మిడ్జిల్‌లో కార్మిక దినోత్సవ వేడుకలు

మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలో మేడే సందర్భంగా, మిడ్జిల్ సెక్షన్ విద్యుత్ ఉప కేంద్రంలో 1104 యూనియన్ కార్మికుల ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవాన్నిశుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల హక్కులపై అవగాహన కల్పించి, శ్రమ దోపిడీ నుండి రక్షణ కల్పించడం, ప్రతి కార్మికుడు పనిచేసే చోట మెరుగైన పరిస్థితులు, పురోగతిని అందించడమే మేడే ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్మికులకు సంక్షేమ, సామాజిక న్యాయం కోసం ఈ దినాన్ని కార్మిక జెండాగా ఎగరవేశారని, అప్పటినుంచి మే 1ని ప్రపంచ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నారని యూనియన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సిబ్బంది తెలిపారు.

సంబంధిత పోస్ట్