మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు గాను బుధవారం మొదటి రోజు 9 నామినేషన్లు దాఖలయ్యాయి. అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి నలుగురు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉందని ఆయన పేర్కొన్నారు.