మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయినిని సికింద్రాబాద్ ఆర్మీ ఆఫీస్ అధికారి డైరెక్టర్ కల్నల్ సునీల్ యాదవ్ బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు జ్ఞాపికను అందజేశారు. అనంతరం ప్రభుత్వ బాలుర కళాశాల, వొకేషనల్ కళాశాల విద్యార్థులకు ఆర్మీలో ఉద్యోగ అవకాశాల గురించి వివరించారు.