బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలంగాణ పర్యటన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ బీజేపీ నేత డీకే అరుణ పేర్కొన్నారు. ఈ పర్యటన బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేస్తుందని, ప్రతి ఇంటికీ బీజేపీని మరింత చేరువ చేయడానికి మరియు రాబోయే స్థానిక ఎన్నికల్లో విజయానికి ఇది ఒక గొప్ప అడుగు అని ఎంపీ అరుణ వెల్లడించారు.