మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో 18 ఏళ్ల హబీబ్ ఉమెన్ అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గురువారం విడుదలైన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.