మహబూబ్ నగర్: పాఠశాలలో గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని షాషబ్ గుట్ట ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) నిధులు రూ. 10 లక్షల వ్యయంతో ఈ అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుమ్మల మమత, ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్, వినోద్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్