నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మయూరి ఎకో పార్క్ లో సందర్శకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, రుసుముతో కూడిన ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయడానికి ఆసక్తి గలవారు స్థానిక పార్క్ అధికారులను సంప్రదించాలని జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గురువారం నాడు ఈ ఏర్పాటు జరగనుంది.