బుధవారం మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు. అభిమానంతో సినిమాలు చూస్తామని, అయితే అభిమానం వేరు, ఆత్మగౌరవం వేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమా యాక్టర్ కాదని, డిప్యూటీ సీఎం అని గుర్తు చేశారు. బాధ్యతగా మాట్లాడాలని, ఏది పడితే అది మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు.