మహబూబ్ నగర్: మహిళల సాధికారతే సమాజఅభివృద్ధికి పునాది: ఎమ్మెల్యే

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మహిళల సాధికారతే సమాజ అభివృద్ధికి పునాది అని అన్నారు. శుక్రవారం, NABARD ఆర్థిక సహకారంతో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన “ఇందిరా మహిళా శక్తి గ్రామ దుకాణం”ను ఆయన ప్రారంభించారు. మహిళా సంఘాల సభ్యులు స్వయంగా తయారు చేసిన పల్లె ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, హస్తకళా వస్తువులకు మార్కెట్ వేదిక కల్పించడం ద్వారా వారి ఆర్థిక స్థితి మరింత బలోపేతం అవుతుందని, తద్వారా వారు స్వయం ఉపాధి ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే కాకుండా, సమాజంలో గౌరవ స్థానాన్ని సంపాదించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్