మిడ్జిల్ మండల్ పరిధిలోని బోయిన్ పల్లి గ్రామంలో జాతీయ రహదారి 167 పై బస్టాండ్ వద్ద ఆదివారం కారు ఢీకొని దేవ్య నాయక్ (39) అనే వ్యక్తి మృతి చెందాడు. లోక్య తాండకు చెందిన దేవ్య నాయక్, బోయిన్పల్లి గ్రామానికి పనుల నిమిత్తం వచ్చి, కల్వకుర్తి- జడ్చర్ల హైవే రోడ్డు దాటుతుండగా, కల్వకుర్తి నుంచి జడ్చర్ల వైపు వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.