సాలానగర్ ప్రాజెక్ట్ జారి పడి వ్యక్తి మృతి

గండీడ్ మండలంలో ఆదివారం జరిగిన ఘటనలో, రుసుంపల్లి గ్రామానికి చెందిన రాములు (40) అనే వ్యక్తి సాలానగర్ ప్రాజెక్టులో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడు. ఈత రాక ప్రాణాలు కోల్పోయినట్లు గ్రామస్థులు తెలిపారు. ఆదివారం ఉదయం మృతదేహాన్ని గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై శేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్