మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన 12వ వార్డు సభ్యురాలు భారతి హరి గౌడ్ బుధవారం వార్డు సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చామని, కానీ ఇప్పుడు డ్వాక్రా బిల్డింగ్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారని, దీంతో విలువలేని చోట ఉండలేనని, అందుకే రాజీనామా చేస్తున్నామని ఆమె మంగళవారం తెలిపారు.