మహబూబ్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ లో స్వల్ప ఉద్రిక్తత

మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో, 60 డివిజన్లకు సంబంధించిన అభ్యర్థుల స్కూటీ శనివారం కొనసాగింది. 49వ డివిజన్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి వివరాలు సరిగా లేవని రిటర్నింగ్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనితో అభ్యర్థి తరపు న్యాయవాదికి, అధికారులకు మధ్య వాగ్వివాదం జరిగింది. 49వ డివిజన్ అభ్యర్థి నామినేషన్ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత పోస్ట్