కోనసీమకు దిష్టి తగిలిందన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాజాగా ఆయన వ్యాఖ్యలను శనివారం జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి ఖండించారు. 'తెలంగాణ వాళ్ల దిష్టి తగిలిందనడం తప్పు. ఇలా మాట్లాడితే ఊరుకునేది లేదు. మా దిష్టి తగిలితే పవన్ గెలిచేవారా.? ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి' అని అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు. పవన్ వ్యాఖ్యలను జగదీశ్ రెడ్డి కూడా ఖండించినట్లు వార్తలు వస్తున్నాయి.