జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సవాల్ విసిరారు. మంగళవారం గాంధీ భవన్‌లో మాట్లాడుతూ, పవన్‌కు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో జడ్చర్ల నుంచి తనపై పోటీ చేయాలని అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు. కేవలం మాటలు చెప్పడం కాదని, ఎన్నికల బరిలో నిలిచి గెలవాలని సవాల్ చేశారు. తనను జడ్చర్ల ప్రజలు గెలిపించారని, అయితే పవన్ గతంలో రెండు చోట్ల పోటీ చేసి ఎందుకు ఓడిపోయారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.