జడ్చర్ల నియోజకవర్గం, మిడ్జిల్ మండల పరిధిలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన పౌర్ణమి డిస్కస్ త్రోలో జాతీయ స్థాయికి ఎంపికైంది. అండర్18 విభాగంలో జరిగిన 12వ తెలంగాణ రాష్ట్ర జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో 30.47 మీటర్ల దూరం విసిరి ద్వితీయ స్థానం సాధించింది. ఈ విజయం గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం.