మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల బస్టాండ్‌లో ఒక ప్రయాణికుడు తన సెల్ ఫోన్‌ను బస్సులోనే మర్చిపోయాడు. బస్సు నంబర్ TG 31Z 0066. కండక్టర్ సమాచారం మేరకు, బస్టాండ్ కంట్రోలర్ విజయ్ కుమార్, సెక్యూరిటీ గార్డ్ లింగంపేట నర్సింహులు ఆ ఫోన్‌ను గుర్తించి, ప్రయాణికుడికి శుక్రవారం తిరిగి అప్పగించారు. ఆర్టీసీ సిబ్బంది నిజాయితీని ప్రయాణికుడు అభినందించాడు.