మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పంచాగులగడ్డ తండాలో ఆదివారం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డిని, ఆర్ఆర్ఆర్(RRR) రోడ్డు నిర్వాసితులు అడ్డుకున్నారు. భూములు కోల్పోతే జీవనాధారం కోల్పోతామని వారు ఎమ్మెల్యే ముందు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.