మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం రాంపేట గ్రామంలో సర్పంచ్ మాధవి ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా హెచ్ఎం మోహన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో జ్ఞానమైన విద్య అందుతుందని, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.