తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు గొంగళ్ల రంజిత్ కుమార్ బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ, షర్మిలకు, కవితకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని వ్యాఖ్యానించారు. కవిత తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోవడంతో పార్టీ పెట్టారని, తమ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.