కేసీఆర్ కి సిట్ నోటీసులు ఎన్నికల స్టంట్ మాత్రమే: డీకే అరుణ

ఎన్నికల వేళ ప్రజలను మోసం చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలను తెరపైకి తెస్తున్నారని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అండర్స్టాండింగ్ పాలిటిక్స్ నడుస్తోందని, ప్రజలు వారి డ్రామాలను నమ్మే స్థితిలో లేరని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కు సీట్ నోటీసులు కూడా ఎన్నికల స్టంట్ అని, ఇద్దరూ ఒకటేనని ఆమె ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్