మహబూబ్నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గంలో SV చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్టోబర్ 1 నుంచి 30 వరకు విద్యార్థులు, మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందించనున్నారు. కంప్యూటర్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రస్ట్ సూచించింది. శిక్షణలో ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం, అవసరమైన డిజిటల్ నైపుణ్యాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ట్రస్ట్ పేర్కొంది.