జడ్చర్ల నియోజకవర్గం ఊర్కొండ మండలం జకినాలపల్లిలో మొహర్రం వేడుకల సందర్భంగా జరిగిన ఘర్షణతో ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఆదివారం రాత్రి కూడా యువకులు వర్గాలుగా విడిపోయి దాడులకు దిగుతుండటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సైతం లెక్కచేయకుండా యువకులు ప్రవర్తిస్తుండటంతో ఎస్ఐ రమాదేవి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.