జడ్చర్లలో ఉద్రిక్తత: నేషనల్ హైవేపై ఆశా వర్కర్ల భారీ ధర్నా!

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కావరమ్మపేటలో సోమవారం ఆశా వర్కర్లు భారీ ఆందోళన చేపట్టారు. గత ఆరు నెలలుగా తమకు వేతనాలు అందడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వందలాది మంది ఆశావర్కర్లు 44వ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నా వల్ల హైదరాబాద్-కర్నూలు జాతీయ రహదారిపై రాకపోకలు గంటకు పైగా స్తంభించాయి. ఆశావర్కర్లను పోలీసులు అరెస్ట్ చేసి, స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్