సంక్రాంతి పండుగలకు వెళ్లేవారు జాగ్రత్త తీసుకోవాలి: జడ్చర్ల సీఐ

జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో, పట్టణాలలో సంక్రాంతి పండుగకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పట్టణ సీఐ కమలాకర్ సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ, పండగలకు సొంత గ్రామాలకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం అందించాలని, తాళాలు వేసిన ఇండ్ల వద్ద పోలీసు సిబ్బందితో కలిసి పర్యవేక్షిస్తామని తెలిపారు. ఇటీవల జడ్చర్ల పట్టణంలో, మండల పరిధిలోని గ్రామాలలో దేవాలయాల హుండీలు, ఇళ్లలో దొంగతనాలు జరిగాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్