గాంధీజీ 78వ వర్ధంతి: బూర్గుపల్లిలో నివాళులర్పించిన బీసీ జాగృతి సేన

మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా జడ్చర్ల మండలం బూర్గుపల్లి గ్రామంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారని, సత్యాగ్రహం, అహింస మార్గంలో ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. కుల, మత బేధాలు లేకుండా సోదరభావంతో జీవించాలని బోధించారని, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలతో బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడారని, అంటరానితనం నిర్మూలనకు కృషి చేశారని తెలిపారు.

సంబంధిత పోస్ట్