మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గంలో గురువారం యూత్ లీడర్, ప్రజా సేవకుడు బాద్మి ధృవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు, పట్టణ ప్రముఖులు, యువజన సంఘాల సభ్యులు ఆయనను పూలమాలలు, శాలువాలతో సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.