జడ్చర్ల నియోజకవర్గంలో మిడ్జిల్ మండల కేంద్రంలో బుధవారం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంక్షేమ లక్ష్యంగా పేదల జీవితాల్లో వెలుగు నింపిన, రైతుల బాంధవుడిగా ఉచిత కరెంటు, జలయజ్ఞం వంటి పథకాలతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన వైఎస్ఆర్ కు ఘన నివాళులర్పించారు.