నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో శుక్రవారం రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి పర్యటించనున్నారు. రూ. 189 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.