కొల్లాపూర్: 'ఒక వ్యక్తికి ఒకే ఓటు' ను అమలు చేయాలి: ఎమ్మెల్యే

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో శుక్రవారం జరిగిన బీఎన్ఏ శిక్షణా కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో 'ఒక వ్యక్తికి ఒకే ఓటు' సూత్రాన్ని కచ్చితంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాలో డబుల్ ఓట్లు, అనర్హుల పేర్ల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని, బూత్ స్థాయి నుంచే గెలుపునకు బాటలు వేసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్