కొల్లాపూర్: శ్రీశైలం రిజర్వాయర్ బోట్ నడిపిన మంత్రి జూపల్లి

అచ్చంపేట నియోజకవర్గం శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం బోటు నడిపారు. బ్రహ్మగిరి (ఈగలపెంట) వద్ద మినీ లాంచీలను మంత్రి ప్రారంభించారు. బ్రహ్మగిరి నుంచి అక్కమహాదేవి గుహల వరకు పర్యాటకులకు వెంటనే బోట్ సౌకర్యం అందుబాటులోకి తేవాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, ఒక బోటుకు అదనంగా మరో బోటును అందుబాటులో ఉంచాలన్నారు. ఒక డ్రైవర్ ను కూడా అదనంగా నియమించాలని మంత్రి సూచించారు.

సంబంధిత పోస్ట్