నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల తండా గ్రామంలో శనివారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. నాటు సారా తయారీకి ఉపయోగించే 750 కేజీల నల్ల బెల్లం రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను సీజ్ చేసి, ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ బెల్లం లింగాల మండలానికి తరలిస్తున్నట్లు సమాచారం. ఈ దాడులలో కొల్లాపూర్ ఎక్సైజ్ ఇనస్పెక్టర్ నాగిరెడ్డి, ఎస్ఐ మురళి, కానిస్టేబుల్ మహేష్ పాల్గొన్నారు.