అందరిపైనా ఆంజనేయ స్వామి కృపా కటాక్షం ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. హనుమాన్ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని అప్పన్నపల్లి ఆంజనేయస్వామి దేవాలయంలో జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.