హన్వాడ మండల కేంద్రానికి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎన్. కేశవులు తన అద్భుతమైన పనితీరుకు గానూ ఉన్నతాధికారుల నుండి క్యాష్ రివార్డును అందుకున్నారు. ఇటీవల శాఖ పరంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో, అప్పగించిన విధులలో అత్యంత ప్రతిభ కనబరిచినందుకు ఈ పురస్కారం లభించింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టర్, అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ శ్రీ అవినాష్ మహంతి చేతుల మీదుగా కానిస్టేబుల్ ఈ రివార్డును అందుకున్నారు.