మహబూబ్‌నగర్ జిల్లాలోని జయప్రకాశ్ నారాయణ ఇంజినీరింగ్ కళాశాల (JPNCE)లో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు మంగళవారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మహబూబ్‌నగర్ జిల్లా చైర్మన్ రవికుమార్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు తమ వినూత్న ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించడం ప్రశంసనీయమని, సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలు, నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించడంలో హ్యాకథాన్‌లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు, ప్రిన్సిపాల్, విభాగాధిపతులు పాల్గొన్నారు.